BHARTI PRAVEEN PARIVAR: విజయవాడ భవానీపురంలోని ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ను కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ సందర్శించారు. ఆమెకు వైద్యాధికారిణి, నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మి స్వాగతం పలికారు. ముఖద్వారం దగ్గర కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ లోగోను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోలు ఎందుకు లేవని కేంద్రమంత్రి ఆమెను నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లోగోను ప్రదర్శించకపోవడంపై వైద్యాధికారులను కేంద్రమంత్రి ప్రశ్నించారు.
కేంద్రం ఇచ్చే నిధులు తీసుకుంటారు.. మోదీ ఫోటోను ప్రదర్శించరా? - రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ఆగ్రహం
BHARTI PRAVEEN PARIVAR: విజయవాడ భవానీపురంలోని ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ను కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లోగోను ప్రదర్శించకపోవడంపై వైద్యాధికారులను కేంద్రమంత్రి ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం లోగోను, ప్రధాని మోదీ ఫొటోను ప్రదర్శించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను వినియోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన వివరాలు ప్రదర్శించకపోవడంపై తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి చోట ఇదే విధానమైన వాకిలి దర్శనమిస్తోందని అన్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ నుంచి అధికారుల బృందం వచ్చి విచారణ చేపడతారన్నారు. అదేవిధంగా షోకాస్ నోటీసు కూడా జారీ చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి