CBN Jailed for Developing AP Hashtag in Twitter: సిబిఎన్ జైల్డ్ ఫర్ డెవలపింగ్ ఏపీ అనే యాష్ టాగ్ ట్విట్టర్ (ఎక్స్) ట్రెండింగ్‌లో ఉంది. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా.. పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ది చేసినందుకా... చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ నెట్టిజన్లు ప్రశ్నిస్తున్నారు. అరెస్ట్ అక్రమం అని... అభివద్ది చేయడమే చంద్రబాబు చేసిన తప్పా అంటూ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుంటుంబ సభ్యులు, సైతం ట్విట్టర్లో స్పందించారు.
ఏపీని సంక్షేమంలో పరుగులు పెట్టించినందుకా: నెల రోజులుగా వ్యవస్థలని మేనేజ్ చేసి మరీ చంద్రబాబుని పిచ్చి జగన్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకే 73 ఏళ్ల వయస్సులో చంద్రబాబుని అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టారని దుయ్యబట్టారు. లోటు బడ్జెట్‌తో ఏర్పడిన నవ్యాంధ్రని ఏ లోటూ లేకుండా అభివృద్ధి-సంక్షేమంలో పరుగులు పెట్టించినందుకా చంద్రబాబు కు జైలు అని ప్రశ్నించారు.
Police Pickets at Nara Bhuvaneshwari Brahmani Camps: నారా భువనేశ్వరి, బ్రాహ్మణి శిబిరం వద్ద భారీగా పోలీస్‌ల మోహరింపు..
ప్రమాదంలో ప్రజాస్వామ్యం: అసలు చంద్రబాబు ఏం తప్పు చేసారని జైల్లో పెట్టారనే ఆవేదన ప్రజల్లోనూ, పార్టీ కార్యకర్తల్లో ఉందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసినందుకా అని ప్రశ్నించారు. లేక ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలి అని తపించినందుకా అని నిలదీశారు. అదే తప్పైతే ఇక ప్రజలకు దిక్కెవరని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Nara Lokesh Mulakat With Chandrababu: చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్.. వైరల్ అవుతున్న లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి ఫొటోలు
ప్రజల కోసం తలపెట్టిన పనులు: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకే చంద్రబాబును జైల్లో పెట్టారా అని లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గానీ, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ గానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కానీ ఇవన్నీ చంద్రబాబు ప్రజల కోసం తలపెట్టిన పనులు వీటినే నేరాలు అంటున్నారని ఆక్షేపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గట్టిగా నిలదీసినందుకు అంగళ్లు కేసు పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మీద పెట్టిన కేసులు చూస్తుంటే ఏపీని అభివృద్ధి చేసినందుకే ఆయన్నిఅరెస్టు చేసి జైల్లో పెట్టినట్టు ఉందని దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు ఉపయోగపడే పని చేయడం తప్పు అనే స్థాయికి రాజకీయం దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో అంతా గ్రహించాలని కోరారు.
చంద్రబాబుకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో యాష్ టాగ్స్: సామాజిక మాధ్యమం ఎక్స్ లో సిబిఎన్ జైల్డ్ ఫర్ డెవలపింగ్ ఏపీ అనే యాష్ టాగ్ దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో ట్రెండ్ అవుతుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకే చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేశారని ఎక్స్ వేదికగా సిబిఎన్ జైల్డ్ ఫర్ డెవలపింగ్ ఏపీ అనే యాష్ టాగ్ తో వేల సంఖ్యలో నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగు ప్రజలు పేర్కొంటున్నారు.
Nara Bhuvaneshwari Left Rajahmundry: రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన నారా భువనేశ్వరి