Cars Sale Increased in Andhra Pradesh: మార్కెట్‌లో కార్ల అమ్మకాలు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ప్రజలు సైకిల్, ద్విచక్రవాహనాలను ఎక్కువగా వినియోగించేవారు. కానీ కొవిడ్ అనంతరం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి. మధ్యతరగతి, ధనిక అనే భేదం లేకుండా.. అందరూ కార్ల కొనుగోలుపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రజారవాణా అందుబాటులో ఉన్నప్పటికీ చాలా వరకు ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణించడానికే ఇష్టపడుతున్నారు. దీనికి తోడు పండుగలకు కంపెనీలు ఇస్తున్న ఆఫర్లతో కార్ల విక్రయాలు ఊపందుకున్నాయి. కారును ప్రజలు ఆస్థిగా.. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. మారిన ప్రజల ఆలోచన ధోరణివల్ల గతేడాది కంటే ఈ ఏడాది కార్ల విక్రయాల్లో 38 శాతం మేర వృద్ధి నమోదైంది.
'ఒక్కసారి ఛార్జింగ్ పెడితే వెయ్యి కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కార్లను త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకొస్తాం'
గణనీయంగా పెరిగిన కార్ల విక్రయాలు : దసరా, దీపావళి పండగ సీజన్లు వాహన విక్రయదారులకు కలిసొచ్చాయి. కోవిడ్ తర్వాత మార్కెట్‌లో తొలిసారిగా కార్ల అమ్మకాలపై గణనీయమైన పెరుగుదల రెండు పండగల సీజన్ల తర్వాత కనిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 2022లో సగటున 2వేల 381 వాహనాలను విక్రయించారు. ఇది క్రమంగా పెరిగి ఈ ఏడాది సగటు అమ్మకాలు 3వేల 722కు ఎగబాకింది.
కార్ల అమ్మకాలు పెరగడానికి కారణం ఇదేనట: నెల సగటు అమ్మకాల్లో 38.71 శాతం పెరుగుదల రికార్డు నమోదైంది. గతేడాది కంటే ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఇచ్చిన ఆఫర్ల వల్ల కార్ల అమ్మకాలు పెరిగినట్లు కార్ల షోరూంల ప్రతినిధులు వివరిస్తున్నారు. ఫైనాన్స్ వెసులుబాటు పెరగడం, సులభతర పద్ధతులు, వాయిదాలు అందుబాటులోకి రావడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
సూపర్ ఫీచర్స్- ధర అదుర్స్, రూ.10 లక్షల బడ్జెట్లో టాప్-5 కార్స్ ఇవే!
కోవిడ్ ఉధృతి అధికంగా ఉన్న సమయంలో అనివార్యంగా.. ప్రజలు రవాణాలో కొత్త మార్పులను కోరుకున్నారు. అందుకు తగిన విధంగానే ద్విచక్ర వాహనం కొనుగోలు కంటే తక్కువ ధరలో లభ్యమయ్యే.. కారు కొనాలనే భావనకు వచ్చేశారు. పైగా కుటుంబం మొత్తం ప్రయాణానికి సౌకర్యంగా ఉండడంతో కార్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపెడ్తున్నారు.
వాణిజ్య వాహనాల విక్రయాలు బాగా పెరుగుతున్నాయి. పాత కార్లను మార్చుకుని అధునాతన ఫీచర్లు ఉన్న కొత్త వాటిని కొనేందుకు కూడా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అందువల్ల ప్రస్తుత త్రైమాసికంలో అన్ని విభాగాల వాహనాల విక్రయం అధికంగా ఉంది.
Tata Upcoming Cars 2023 : జోరుమీదున్న టాటా మోటార్స్.. వరుసగా 7 కార్ల లాంఛింగ్కు సన్నాహాలు!