YOUTH WORRIED ABOUT AGE LIMIT : శంకర్ అనే కృష్ణా జిల్లా వాసి 2018లో అరమార్కు తేడాతో.. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించలేకపోయాడు. మరో నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తూ హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు . తాజాగా పడిన నోటిఫికేషన్ ప్రకారం శంకర్ నెల రోజుల తేడాతో ఏజ్ బార్ అయ్యాడు. ఇది ఒక్క శంకర్ ఆవేదన మాత్రమే కాదు . ఈ తరహాలో దాదాపు 2లక్షల మంది అభ్యర్థులు వయోపరిమితి కారణంగా అనర్హులవుతున్నారు. ప్రభుత్వం పునరాలోచించి.. వయో పరిమితి పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు.
నోటిఫికేషన్ వచ్చిందని సంబర పడేలోపే.. వయోపరిమితి అడ్డు
YOUTH WORRIED ABOUT AGE LIMIT IN POLICE RECRUITMENT : పోలీసు ఉద్యోగమే వారి కల. నోటిఫికేషన్ కోసం.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఎన్నో ఏళ్ల ఎదురు చూపులకు తెరదించుతూ.. ప్రభుత్వం ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబర పడేలోపే.. వయోపరిమితి రూపంలో వారికి నిరాశ ఎదురైంది. సుమారు రెండు లక్షల మంది అభ్యర్ధులు ఇలాంటి వేదన అనుభవిస్తున్నారు.
YOUTH WORRIED ABOUT AGE LIMIT IN POLICE RECRUITMENT
ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచాలని నిరుద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. తెలంగాణలో మూడేళ్లు వయోపరిమితి పెంచారని.. రాష్ట్రప్రభుత్వం కూడా వెసులుబాటు కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం వయోపరిమితిపై స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని.. నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: