ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైసీపీ నేతలు బూడిదను సైతం వదలటం లేదు..! సోము వీర్రాజు - crime

Bjp and Janasena Leaders protest: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిద చెరువును బీజేపీ, జనసేన నాయకులు పరిశీలించారు. గతంలో థర్మల్ ప్లాంటు నుంచి వెలువడే బూడిదను స్థానికులు తరలించేందుకు అవకాశం ఉండేదని తెలిపారు. ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బూడిద తరలిస్తూ లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 1, 2023, 5:01 PM IST

Bjp and Janasena Leaders protest: అది ఓ ప్రముఖ థర్మల్ విద్యుత్ కేంద్రం, ఆ చుట్టు పక్కల ఉన్న పరిసర గ్రామాలు ఆ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద, కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వారికి కాస్త ఉరటగా ఉండేందుకు ఆ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిదను స్థానికులు తీసుకోవడానికి అనుమతి ఉండేది. ఆ విద్యుత్ కేంద్ర మీద ఆధారపడి అనేక మంది స్థానికులు బతుకుతున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికారపార్టికి చెందిన నాయకుల కన్ను ఆ బూడిదపై పడింది. ఇంకేముంది అనుకున్నదే తడవుగా చక్రం తిప్పారు. స్థానికులు తరిలించాల్సిన బూడిదను లారీలు పెట్టిమరీ... రూ. 3,000 అమ్ముకుంటున్నారు. ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నాయకుడు గాంధీ స్పందించారు. జెన్ కో ఎండీ వెంటనే స్పందించి స్థానికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిద చెరువును బీజేపీ, జనసేన నాయకులు పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి బూడిద కారణంగా వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత వెలువడే వేస్ట్ ని పైపుల ద్వారా బూడిద చెరువుకి తరలిస్తున్నారు. గతంలో ఈ బూడిదను తరలించే అవకాశం స్థానికులకు ఇచ్చేవారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ పార్టీ పెద్దలకు బూడిద తరలింపు బాధ్యత అప్పగించుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రభుత్వంపై మండిపడ్డారు. థర్మల్ ప్లాంటు నుంచి వెలువడే బూడిదతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.

బూడిద నుంచి వెలువడే దుమ్ము, దూలి కారణంగా స్థానికంగా నివసిస్తున్న 8గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనేక మంది అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం థర్మల్ ప్లాంట్ నుంచి వెలువడే బూడిద తరలింపుని నవయుగ, మెగా కంపెనీలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ కంపెనీలు బూడిద తరలింపు మీద ఈ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి తప్ప ప్రజల ఆరోగ్యం గాలికొదిలేశాయని దుయ్యబట్టారు. కేవలం ఈ థర్మల్ ప్లాంట్ బూడిద తరలింపు బాధ్యత జెన్ కో కంపెనీకే అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రితో పాటు పై అధికారులకు లేఖ రాస్తానన్నారు.

'అధికార పార్టీకి చెందిన నాయకులు ఇక్కడ బూడిదను తరలిస్తున్నారని తెలిసింది. స్థానికుల పొట్ట కొట్టి ఇలా ప్రతి రోజు ఆరువందల లారీలకు ఇస్తున్నారు. బయటి వ్యక్తులకు ఇచ్చి స్థానికుల పొట్టకొడుతున్నారు . ఇదే అంశంపై అధికారులతో మాట్లడితే.. వారు ఎపీ జెన్ కో ఎండీ ఆరువందల లారీలు పెట్టి తీసుకుపోతుంటే ఎండీ దృష్టికి రావడం లేదా? ఎమ్మెల్యేలు పెట్టిన ప్రైవేట్ మిషన్​లను సీజ్ చేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ, జనసేన ఉద్యమం ఉద్ధృతం చేస్తాం. ఇదే అంశంపై సీఎం జగన్​తో పాటుగా, ఏపీ జెన్ కో ఎండీకి సైతం లేఖ పంపిస్తాను.'- సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

బూడిద చెరువును పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details