Bandi Sanjay React on Sajjala Comments: కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే వైకాపా విధానమని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్, జగన్ కలిసి నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కవిత లిక్కర్ స్కామ్‌ను పక్కదోవ పట్టించేందుకే వైకాపా నేతలతో కలిసి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
'సజ్జల వ్యాఖ్యలు.. దాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇద్దరు సీఎంల డ్రామా' - సజ్జల వ్యాఖ్యలపై బండి సంజయ్ కామెంట్స్
Bandi Sanjay React on Sajjala Comments: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆ వ్యాఖ్యల్ని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. కేసీఆర్, జగన్ కలిసి నాటకం ఆడుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
bandi sanjay
''కేసీఆర్ కుమార్తె కవిత రూ.లక్ష కోట్ల లిక్కర్ దందా చేశారు. కవిత లిక్కర్ స్కామ్‌ను పక్కదోవ పట్టించేందుకే వైకాపా నేతలతో కేసీఆర్ కుట్ర. ఇద్దరు సీఎంలు కలిసి నాటకాలాడుతున్నారు. పార్లమెంటులో బిల్లుకు బీజేపీ మద్దతు వల్లే తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. రాష్ట్రంలో పారదర్శక పాలన భాజపాతోనే సాధ్యం. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే భాజపా అధికారంలోకి రావాలి.'' - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చూడండి: