BAIL GRANTED TO MARGADARSI MANAGERS : మార్గదర్శి శాఖలకు చెందిన విజయవాడ, ఒంగోలు, చీరాల మేనేజర్లకు.. సోమవారం బెయిల్ మంజూరైంది. విజయవాడ అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఈ నెల 12న సీఐడీ అరెస్టు చేసిన విజయవాడ లబ్బీపేట మార్గదర్శి బ్రాంచి మేనేజర్ బండారు శ్రీనివాసరావుకు.. విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి- MSJ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అభియోగపత్రం దాఖలు చేసే వరకూ..ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఏదో ఒక సమయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు ప్రతిరోజూ హాజరు కావాలని,..షరతు విధించింది. ప్రాథమిక ఆధారాలు లేకపోయినా తప్పుడు కేసు నమోదు చేసి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారని.. మార్గదర్శి మేనేజర్ తరఫు న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వాదించారు.
మార్గదర్శి సొమ్ము చెల్లించలేదంటూ..ఏ ఒక్క సబ్‌స్క్రైబర్ నుంచీ ఫిర్యాదు లేనందున,.. చిట్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా F.I.R. నమోదు చెల్లదన్నారు. మార్గదర్శిపై బలవంతపు చర్యలు వద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనూ.. సీఐడీ అధికారులు ఉల్లంఘించారని కోర్టుదృష్టికి తీసుకెళ్లారు.ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి,.. ఇప్పటికే రిజిస్టర్లు, దస్త్రాలను సీజ్ చేసినందున పిటిషనర్‌ను రిమాండ్‌లో.. ఉంచాల్సిన అవసరం లేదని వాదించారు. దస్త్రాలను దర్యాప్తు సంస్థ సీజ్ చేసిందని, .. బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని న్యాయాధికారి అన్నారు. సాక్ష్యాధారాలన్నీ దస్త్రాల రూపంలో.. చిట్ రిజిస్ట్రార్ వద్దే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని.. బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఒంగోలు, చీరాలలో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు: మార్గదర్శి కేసులో ఒంగోలు బ్రాంచి మేనేజర్.. కరణం నాగేశ్వరరావు, పేయబుల్ మేనేజర్ సాంబశ్రీను, చీరాల బ్రాంచి మేనేజరు జి.సురేంద్ర,.. అకౌంటెంట్లు మద్దినేని కోటేశ్వరరావు, బుడితి శ్రీనివాసులుకు ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎ.భారతి..మధ్యంతర బెయిల్..మంజూరు చేశారు. పిటిషనర్లను అరెస్ట్ చేయవద్దని.. సీఐడీని నిర్దేశించారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించడంతో పాటు విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాలని, లేని పక్షంలో బెయిల్ రద్దవుతుందని పేర్కొన్నారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసు నమోదు చేస్తే CRPC 41ఏ నోటీసు ఇచ్చి..చట్టప్రకారం వ్యవహరించాలని తీర్పులో పేర్కొన్నారు.