ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిస్కమ్ బకాయిల్లో ఏపీ అగ్రస్థానం.. కేంద్ర విద్యుత్​శాఖ స్పష్టం

DISCOM: డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. విద్యుత్‌ డిస్కమ్‌లకు ఎపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 12వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని కేంద్ర విద్యుత్‌ శాఖ ఉన్నట్లు వెల్లడించింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 7, 2023, 8:18 PM IST

DISCOM: విద్యుత్‌ డిస్కమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 12వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని కేంద్ర విద్యుత్‌ శాఖ వెల్లడించింది. వీటిలో ప్రభుత్వం సబ్సిడీ కింద చెల్లించాల్సిన వాటితో పాటు.. పలు ప్రభుత్వ విభాగాలు కూడా ఉన్నాయి. 2020 మార్చి 31 నుంచి 2022 మార్చి 31 వరకు ఎపీ ప్రభుత్వం నుంచి డిస్కంలకు రూ.12,294.3 కోట్లు బకాయిలు ఉన్నట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరాలు బయటపెట్టింది. 2022 మార్చి31 నాటికి రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు డిస్కంలకు రూ.9116 కోట్లు బకాయి ఉన్నాయన్న కేంద్ర విద్యుత్‌ శాఖ.. ఇదేకాలంలో సబ్సిడీ కింద డిస్కంలకు 3178.3 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.

2020 మార్చి నాటికి రూ.7064 కోట్లు, 2021 మార్చి నాటికి రూ.8735.9 కోట్లు, 2022 మార్చి నాటికి రూ.9116 కోట్లు బకాయిలు ప్రభుత్వ విభాగాలు చెల్లించాల్సి ఉండగా 2020 మార్చి నాటికి సబ్సిడీ కింద రూ.6179.2 కోట్లు, 2021 మార్చి నాటికి రూ.5139.6 కోట్లు, 2022 మార్చి నాటికి రూ.3178.3 కోట్ల సబ్సిడీ కింద చెల్లించాల్సి ఉందని కేంద్రం తెలిపింది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details