AP JAC AMARAVATI MEETING : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై.. ఆందోళన బాటపట్టిన ఏపీ జేఏసీ అమరావతి.. భవిష్యత్ కార్యచరణపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా విజయవాడలోని రెవెన్యూ భవన్లో APJAC అమరావతి రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. 26 జిల్లాల ప్రధాన కార్యదర్శులు, ఛైర్మన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటి దశ ఉద్యమ కార్యాచరణ పూర్తయినందున మలిదశ కార్యాచరణ షెడ్యూల్ను సాయంత్రం ప్రకటించనున్నట్లు ఏపీ జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలను ఉద్యోగుల ఏపీజీఎల్ఐ బకాయిల కింద ఇచ్చామనీ చెబుతోందని.. కానీ ఎంత మేరకు ఇచ్చారో వివరాలు కోరితే నేటికీ చెప్పటం లేదని మండిపడ్డారు.
"సాయంత్రం మలిదశ ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ ప్రకటిస్తాం. ఇప్పటికే ఉద్యోగులను ఉద్యమానికి సమాయత్తం చేశాం. గతంలో సీఎం ఇచ్చిన హామీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి"-ఏపీ ఐకాస అమరావతి