ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ ఫైబర్ ద్వారా రేపే చిన్న సినిమా విడుదల.. కేవలం రూ.39 - ఇండస్ట్రియల్ కనెక్ట్

AP Fiber chairman gautham reddy: ఓటిటి యాప్​లకు, థియేటర్లకు ఏపీ ఎఫ్​ఎస్​ఎల్ పోటీ కాదని, చిన్న సినిమాల కోసం ఉపయోగపడే వేదిక అని ఏపీ ఫైబర్ చైర్మన్ పి. గౌతం రెడ్డి వెల్లడించారు. రేపు ఓ పెద్ద సినిమా రిలీజ్ సమయంలో ఏపీ ఫైబర్ ద్వారా ఓ చిన్న సినిమాను రూ. 39కే విడుదల చేస్తున్నామన్నారు. ఏపీ ఫైబర్​కు ఉన్న 10 లక్షల మంది వినియోగదారుల్లో ఎక్కువ మందికి వినోదాన్ని కల్పించడమే తమ లక్ష్యమని గౌతంరెడ్డి అన్నారు. త్వరలో ఏపీ ఫైబర్ తరపున ఓటిటి తరహా యాప్ తీసుకువస్తామన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 15, 2023, 9:10 PM IST

AP Fiber chairman gautham reddy: మొదటిరోజే మొదటి షో అనే ప్రాతిపదికన ఏపీ ఫైబర్ నెట్ ద్వారా సినిమాను అందించాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ ఫైబర్ చైర్మన్ పి.గౌతం రెడ్డితెలిపారు. అందుకే సినిమాలను తక్కువ ధరకే ప్రజలకు వినోదాన్ని అందించేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇతర ఓటిటి యాప్​లకు, థియేటర్​లకు ఏపీ ఎఫ్​ఎస్​ఎల్ పోటీ కాదని, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకటం లేదని అన్నారు. రేపు ఓ పెద్ద సినిమా రిలీజ్ సమయంలో ఏపీ ఫైబర్ ద్వారా ఓ చిన్న సినిమాను రూ. 39కే విడుదల చేస్తున్నామన్నారు. పెద్ద సినిమా విడుదల చేసే సమయంలో టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. పైరసీకి అవకాశం లేకుండా ఈ సినిమాలు విడుదలకు సాంకేతిక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు నష్టం జరిగే కంటెంట్ ఉంటే స్క్రీనింగ్ చేసే విడుదల చేస్తామన్నారు.

16వ తేదీన ఏపీ ఫైబర్ ద్వారా ఓ చిన్న సినిమాను రూ. 39కే విడుదల

ఏపీ ఫైబర్ తరపున ఓటిటి తరహా యాప్: ఏపీ ఫైబర్​కు ఉన్న 10 లక్షల మంది వినియోగదారుల్లో ఎక్కువ మందికి వినోదాన్ని కల్పించడమే తమ లక్ష్యమని గౌతంరెడ్డి అన్నారు. త్వరలో ఏపీ ఫైబర్ తరపున ఓటిటి తరహా యాప్ తీసుకువస్తామన్నారు. ఆరు నెలల్లో ఆ యాప్​కు వచ్చే రెస్పాన్స్ ద్వారా ఇతర వీడియో కంటెంట్​ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రభుత్వ కంపెనీగా ఆర్థిక పరిస్థితి సహకరిస్తే భవిష్యత్ లో సినిమాలు కూడా నిర్మిస్తామన్నారు. ఈ విధానంపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒకరిద్దరు వ్యతిరేకత వ్యక్తం చేసినా పరిశ్రమకు నష్టం ఉండదని మిగిలిన వారు అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. వెబ్ సిరీస్, టెలి ఫిలిం​ల విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గౌతంరెడ్డి తెలిపారు.

ఇండస్ట్రియల్ కనెక్ట్: ఏపీ నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇండస్ట్రియల్ కనెక్ట్ పేరిట కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ప్రారంభమైన కియా నాలెడ్జ్ ఎక్సలెన్స్ సెంటర్ తరహాలోనే ఆ అనుసంధానం జరగాలని బుగ్గన పేర్కొన్నారు. ఆగస్ట్ 15వ తేదీ కల్లా ఇండస్ట్రియల్ కనెక్ట్ ప్రక్రియ పూర్తి కావాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 200 వరకూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​లు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. స్కిల్ హబ్​లలో శిక్షణ కోసం ఇప్పటివరకూ 15,559 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటికే 308 బ్యాచ్​లలోని 8,807 మందికి శిక్షణ పూర్తయిందని మంత్రికి తెలిపారు. ఇంకా 249 బ్యాచ్​లలోని 6,733 మంది శిక్షణ దశలో ఉన్నట్లు రాజేంద్రనాథ్ రెడ్డికి వెల్లడించారు. 6,713 మంది యువతకు ధృవపత్రాలు అందజేశామన్నారు. స్కిల్ హబ్​ల ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా వందశాతం ప్లేస్ మెంట్లను నమోదు చేసినట్టు అధికారులు మంత్రికి వివరించారు. నంద్యాల జిల్లా 93 శాతం మేర నమోదైందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details