CM Jagan Release Rytu Bharosa Funds : 'వైఎస్‌ఆర్ రైతు భరోసా' నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేశారు. కౌలు రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటూ.. వారికి తోడుగా ఉన్నామన్నారు. తొలి విడతగా రూ.109.74 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా కౌలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన 11 వేల 373 మంది రైతులకు సబ్సిడీ కింద రూ.11.01 కోట్లను విడుదల చేసినట్లు వివరించారు.
CM Jagan Released the Funds: అర్హత ఉండి పథకాలు దక్కని వారికి నిధులు విడుదల.. బటన్ నొక్కిన సీఎం జగన్
CM Jagan comments:ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..''ఈరోజు మొత్తం రూ.120.75 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్ ద్వారా బటన్ నొక్కి, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేశాం. కౌలు రైతుల కోసం మంచి చట్టాన్ని తీసుకువచ్చి.. వారికి నష్టం జరగకుండా సీసీఆర్సీ కార్డులు తెచ్చాం. దీంతో భూ యజమానులకు రావాల్సిన లబ్ధి వారికి రావడం సహా కౌలు రైతులకూ లబ్ధి అందించేలా చర్యలు తీసుకున్నాం. ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగా అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు తోడుగా నిలబడుతున్నాం. 50 నెలల్లో.. 5.28 లక్షల కౌలు రైతులకు, 3.99 లక్షల ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు సాగు చేసే గిరిజనులకు, 9.22 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చాం. 50 నెలల్లోనే 1,120 కోట్లు రూపాయలు నేరుగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేశాం.'' అని అన్నారు.