ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

R5 Zone: ఆర్‌-5 జోన్‌‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. ముగిసిన విచారణ

R5 Zone arguments latest news: రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్‌ ప్రణాళికలో మార్పులు చేసి, ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై నేడు హైకోర్టులో విచారణ ముగిసింది. విచారణలో భాగంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

R5 Zone
R5 Zone

By

Published : Apr 21, 2023, 7:14 PM IST

Updated : Apr 21, 2023, 7:19 PM IST

R5 Zone arguments latest news: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ఆర్‌-5 జోన్‌‌ గెజిట్‌ నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లపై ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో విచారణ ముగిసింది. విచారణలో భాగంగా పిటిషనర్లతోపాటు, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదోపవాదాలను విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పును రిజర్వ్‌ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

ప్రభుత్వం జీఓను రద్దు చేయాలి..రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌ను ఏర్పాటు చేసి 45వేల మంది పేదలకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోందని.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు ఈ ఉత్తర్వులు వ్యతిరేకంగా ఉన్నాయంటూ.. అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో రాజధాని రైతులు పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరపున న్యాయవాదులు కామత్‌, ఇంద్రనీల్‌, ఆంజనేయులు తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం జీఓను రద్దు చేయాలని పిటిషనర్లు, అమలుకు ఆదేశాలివ్వాలని ప్రభుత్వం మధ్యంతర ఉత్తర్వుల కోసం వాదనలు గట్టిగా వినిపించాయి.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకే ఆర్‌-5 జోన్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. న్యాయవాదులకు లాంజ్‌లు, లంచ్ చేసేందుకు అవకాశం కూడా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కనీసం మౌలిక వసతులు కల్పించలేదని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వ్యక్తులకు లాభం కలిగించడం కాదు.. సంస్థలను నిర్మించాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇప్పటికే హైకోర్టుకు సరైన రోడ్డు లేదని.. సాయంత్రం లైట్లు వెలగడం లేదని రైతుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే కోర్టు ఆదేశించినా కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదని గుర్తు చేశారు.

తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం.. అనంతరం దీనిపై తాము కోర్టు ధిక్కార పిటిషన్ వేసినట్లు న్యాయవాదులు ప్రస్తావించారు. సీఆర్‌డీఏ కమీషనర్‌ను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చిందని న్యాయవాది గుర్తు చేశారు. రాజధాని రైతులు నిరుపేదలకు పట్టాలు ఇచ్చేందుకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ చేస్తోన్న ప్రచారం సరికాదని.. ఇప్పటికే రాజధానిలో పేదల కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలాలు ఉన్నాయని.. వేలాది ఇళ్లను నిర్మించినా ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వని అంశాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ధర్మాసనం ముందు ఉంచారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

అసలు ఏం జరిగిదంటే..రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలవారికైనా రాష్ట్ర రాజధాని అమరావతిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా జగన్ ప్రభుత్వం కొన్ని నెలలక్రితం ఆర్‌-5 జోన్‌‌ను ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఆగ్రహించిన అమరావతి రైతులు.. తమ అభిప్రాయాన్ని తెలుకోకుండా రాజధానిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌‌ను జారీ చేసిందని.. అందులో మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో ఉన్న 900 ఎకరాలను ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చిందంటూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలాలు చేశారు. దాఖలైన పిటిషన్లపై పలుమార్లు విచారించిన న్యాయస్థానం వాయిదాలు వేసింది. ఈ క్రమంలో తాజాగా విచారణ ముగిసింది.

ఇవీ చదవండి

Last Updated : Apr 21, 2023, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details