ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

53 ఏళ్ల తరువాత.. ఆనాటి మధుర స్మృతులు - AP LATEST NEWS

Get Together Party: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వారంతా 53 ఏళ్ల తర్వాత కలిశారు. పదో తరగతి తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో స్ధిరపడ్డ వారంతా.. ఇన్నాళ్లకు ఒక దగ్గర సమావేశమయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని... యోగ క్షేమాల గురించి ఆరా తీసుకున్నారు. అప్పటి మధురస్మృతులను నెమరవేసుకుని పరవశించిపోయారు. ఈ అపూర్వ ఘట్టానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వేదికైంది.

Tenth class students fifty three years ago
ఏభై మూడు ఏళ్ల క్రితం పదో తరగతి విద్యార్థులు

By

Published : Nov 6, 2022, 6:00 PM IST

Get Together Party: విజయవాడ కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1966, 67, 68, 69 సంవత్సరాల్లో పదో తరగతి చదివిన పూర్వవిద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరిగింది. పూర్వవిద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి వారికి పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

వాట్సప్ గ్రూప్​లో తరుచూ కలిసే స్నేహితులందరినీ కలిపి ఒక గ్రూప్ యాడ్ చేశారు. ఒకరి ద్వారా మరొకరు.. అలా పాత స్నేహితులను ఒక వేదికపై తీసుకువచ్చారు. కరోనా రాక ముందు నుంచి కలవాలని ప్రయత్నాలు చేస్తున్న సాధ్యం కాలేదని.. ఈరోజు అందరినీ ఒకచోట కలుసుకోవడం సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. ఇక్కడి రాగానే బాల్యంలో చేసిన అల్లరి, చిలిపిచేష్టలు అన్ని నెమరు వేసున్నామని చెబుతున్నారు.

చిన్ననాటి ఆత్మీయులను కలుసుకుని.. పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 53 ఏళ్ల తరువాత అందరూ ఒక వేదికపై కలుసుకోవడం చిన్ననాటి బాల్యాన్ని నెమరువేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ బాల్య స్నేహితులను కలుసుకున్నామని చెప్పారు.

వయో భారాన్ని సైతం లెక్కచేయకుండా తమ స్నేహితులను కలిసేందుకు చాలా మంది ఈ ఆత్మీయ కలయికకు హాజరయ్యారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచాన్ని మరచిపోయి వారి పాత కాలపు జ్ఞాపకాలలోకి వెళ్లిపోయారు. పాత స్నేహితులను కలవడం మనసుకు ఉత్సాహాన్ని ఇస్తోందని.. మనలను పాత జ్ఞాపకాలలోకి తీసుకెళ్తుందని పూర్వ విద్యార్థలు చెబుతున్నారు. ఈ ఆత్మీయ కలయిక అలసిన మనసుల్లో ఆనందాన్ని నింపింది. పిల్లల మాదిరిగా వారు ఆనందంలో పరవశించిపోయారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details