A person was killed in Nandigama: ఎన్టీఆర్ జిల్లా -నందిగామ కంచికచర్ల మండలం కేసర గ్రామానికి చెందిన కూరాకుల వెంకటేశ్వరరావు (35 ) ను కొందరు వ్యక్తులు బీరు సీసాలతో పొడిచి దారుణంగా హత్య చేశారు. హత్య గురైన వ్యక్తి మద్రాస్ టీ స్టాల్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడని ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారని మృతుడి బంధువులు తెలిపారు. మంగళవారం రాత్రి ఆయనను ఇంటి నుంచి కొందరు నందిగామకు తీసుకొచ్చారని..ఆ వ్యక్తులే ఆయనను హతమార్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు ఆర్థిక గొడవలే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన నందిగామ ఏసీపీ నాగేశ్వర్ రెడ్డి, సీఐ సతీష్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బీరు సీసాలతో పొడిచి నందిగామలో దారుణ హత్య - ఎన్టీఆర్ జిల్లా నేరవార్తలు
A person was killed in Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. బీరు సీసాలతో పొడిచి చంపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆర్థిక గొడవల కారణంగానే ఈ హత్య జరిగుంటుందని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నందిగామలో దారుణ హత్య
Last Updated : Nov 2, 2022, 1:29 PM IST