ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Warms in peanut chikki: పల్లీ చిక్కీలో పురుగులు.. ఆందోళనలో విద్యార్థులు - పల్లీ చిక్కీలో పురుగులు

Warms in peanut chikki: విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసే చిక్కీల్లో పురుగులు వచ్చిన ఘటన.. నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇక్కడి ఎస్సీ కాలనీలోని స్పెషల్‌ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం పంపిణీ చేసిన చిక్కీలో పురుగులు వచ్చాయి.

Warms in peanut chikki at nandyal district
పల్లీ చిక్కీలో పురుగులు

By

Published : Apr 9, 2022, 11:04 AM IST

పల్లీ చిక్కీలో పురుగులు

Warms in peanut chikki: పల్లీ చిక్కీల వల్ల పౌష్టికాహారం అందడం ఏమోకానీ.. ప్రాణాల మీదకు వచ్చేలా ఉందని.. నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం ఎ.కోడూరులో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ఎస్సీ కాలనీలోని స్పెషల్‌ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం పంపిణీ చేసిన చిక్కీలో పురుగులు వచ్చాయి. అది గమనించిన విద్యార్థులు, తల్లిదండ్రులు వెంటనే ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మీకి చూపించారు.

ఈ విషయం మండల విద్యాధికారి రామసుబ్బయ్య దృష్టికి తీసుకెళ్లగా..‘చిక్కీ గతంలో పారదర్శకమైన కవర్లలో వచ్చేది. లోపల ఎలా ఉండేదో తెలుసుకునే వీలుండేది. ప్రస్తుతం రంగులు, బొమ్మలతో కూడిన కవర్లలో ఇస్తుండటం వల్ల లోన చిక్కీల నాణ్యత గుర్తించలేకపోతున్నాం. కవర్లు చింపేసి ఇస్తే పిల్లలు తీసుకోరని అలాగే ఇస్తున్నాం. పురుగులు వచ్చాయంటున్న చిక్కీలు వారం రోజుల కిందటే గుత్తేదారు నుంచి అందాయి’ అని వివరణ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details