శ్రీశైలం జలాశయం వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం - టీఎస్ ఆర్టీసీ బస్సు ప్రమాదం
16:25 January 29
బస్సులో 30 మంది ప్రయాణికులు
RTC bus accident at Srisailam reservoir: శ్రీశైలం జలాశయం వద్ద టీఎస్ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు జలాశయం మలుపు వద్ద అదుపుతప్పి రక్షణ గోడను ఢీ కొట్టింది. ప్రహరీ గోడ ఇనుప బారికేడ్ వల్ల బస్సు నిలిచిపోయింది. దీంతో పెను ప్రమాదమే తప్పిందనుకోవచ్చు.
అప్రమత్తమైన 30మంది ప్రయాణికులు బస్సులోంచి దిగిపోయారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. ప్రమాదానికి కారణం ఏంటి ?.. డ్రైవర్ నిర్లక్ష్యమా.. ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా.. అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి: