Sajjala Comments on CBN: తెలంగాణలో బలం చూపి బీజేపీని ఆకట్టుకోవడానికే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారో.. ఏ ప్రయోగం చేయబోతున్నారో తెలియదని అన్నారు. చంద్రబాబుకు ఆధార్, ఓటు కార్డు రెండూ తెలంగాణలోనే ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారో స్పష్టత ఇవ్వాలని తెలిపారు.
డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీకి చాలా కాలంగా దూరంగా ఉన్నారని, ఆయన వైసీపీలో ఉన్నట్లు తాము భావించడం లేదని సజ్జల అన్నారు. ట్యాబుల పంపిణీలో అవకతవకలు అంటూ నోటికొచ్చినట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని,.. ట్యాబ్‌ల కొనుగోలు విషయంలో ఎక్కడా అవకతవకలు జరగలేదని తెలిపారు. అలాగే బైజ్యూస్ కంటెంట్‌కు చాలా డిమాండ్ ఉంది కాబట్టి పిల్లలకు ఫ్రీగా ఇస్తున్నామని అన్నారు.