ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాణ్యంలోని మూడు సచివాలయాల్లో చోరీ.. ఎవరి పని..? - ఆంధ్రప్రదేశ్ దొంగతనం వార్తలు

Theft In Panyam Secretariats: పాణ్యంలో దొంగలు రెచ్చిపోయారు. ఒకేసారి మూడు సచివాలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి.. వస్తువులన్నీ చిందరవందరగా పడేసి బీరువాలలో వెతికినట్లు తెలుస్తోంది. ఇంతకు వాళ్లు ఏం ఎత్తుకెళ్లారు.. అసలు ఎవరి పనో కూపీ లాగే పనిలో పోలీసులు పడ్డారు.

secretariats
సచివాలయం

By

Published : Dec 22, 2022, 3:34 PM IST

Theft In Panyam Secretariats: నంద్యాల జిల్లా పాణ్యంలో ఒకేసారి మూడు సచివాలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సచివాలయం 1, 2, 4లలో దొంగతనం జరిగింది. సచివాలయాల తాళాలు పగలగొట్టి కార్యాలయంలోకి వెళ్లి రికార్డులను చిందరవందరగా పడేసి బీరువాలలో శోధించారు. పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దించి విచారిస్తామని పోలీసులు చెప్పారు. ఏమేమి వస్తువులు, రికార్డులు తీసుకెళ్లారో తెలియదని అధికారులు చెబుతున్నారు.

పాణ్యంలో ఒకేసారి మూడు సచివాలయాల్లో దొంగతనం

ABOUT THE AUTHOR

...view details