కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడుకు చెందిన యువకుడు హంద్రీ నీవా నది పక్కన చెట్టుకు ఉరి వేసుకుని మృతిచెందాడు. గ్రామానికి చెందిన శ్యాకీరా బాషాగా.. అతనిని గుర్తించారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అతనికి కొంత కాలంగా మతి స్తిమితం సరిగ్గా లేదని గ్రామస్థులు తెలిపారు. ఈ కారణంగానే శ్యాకీరా బాషా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.