కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీకి చెందిన కార్తీక్ అనే యువకుడు... ఏ పనీ చేయకండా తిరుగుతుండటంతో తల్లిదండ్రులు మందలించారు. మనస్థాపం చెందిన కార్తీక్... పట్టణంలోని ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులు మందలించారని.. యువకుడు ఆత్మహత్య - kurnool district crime
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు మందలించారన్న మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య