చిన్న విషయంలో మొదలైన గొడవ... ప్రాణాలు తీసే వరకూ వెళ్లింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకుల్లు గ్రామంలో లక్మన్న, వడ్డే తిమ్మన్నలకు ఇళ్ల మధ్య గోడకు రంగులు వేసే విషయంలో ఘర్షణ జరిగింది. తిమ్మన్న, అతని కుమారుడు వెంకటేశ్వర్లు, భార్య రంగమ్మ పొలంలో పనిచేస్తుండగా ప్రత్యర్థులు కర్రలతో దాడి చేసి వెంకటేశ్వర్లును హత్య చేశారు. తిమ్మన్న, రంగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రంగుల పంచాయితీ.. హత్యకు దారితీసింది! - Kurnool District
ఇళ్ల మధ్య గోడకు రంగులు వేసే విషయంలో ఘర్షణ జరిగి... ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
యువకుడి హత్య