YCP WOMAN LEADER PROTEST AT MIDNIGHT : కర్నూలులో వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి జమీల బేగం అర్థరాత్రి నిరాహార దీక్షకు దిగారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గౌరవం లేదని ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకు పదవులు కట్టబెడుతున్నారంటూ.. నగరంలోని వైయస్సార్ విగ్రహం ముందు బైఠాయించారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడినా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు కూడా అధిష్టానం వద్ద న్యాయం జరగడం లేదని అన్నారు. ముఖ్యమంత్రిని కలిసేంత వరకు దీక్ష విరమించనని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా..ఆమె ఆందోళన విరమించలేదు.
అర్ధరాత్రి వైఎస్సార్ విగ్రహం వద్ద వైసీపీ మహిళా నేత నిరసన.. ఎందుకంటే? - వైసీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి అర్ధరాత్రి నిరసన
YCP WOMAN LEADER PROTEST AT MIDNIGHT IN KURNOOL : పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గౌరవం లేదని ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకు పదవులు కట్టబెడుతున్నారంటూ కర్నూలులో వైసీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి అర్ధరాత్రి నిరసనకు దిగారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడినా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ycp woman state secretary midnight protest