ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య విభేదాలు!

కర్నూలులో అధికార పార్టీ నాయకుల మద్య ఎలాంటి విభేదాలు లేవని నగర వైకాపా అధ్యక్షుడు రాజా విఘ్ణవర్దన్ రెడ్డి తెలిపారు. తప్పుడు ఫేస్ బుక్ అకౌంట్​లతో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

_ycp_pc_
కర్నూలులో అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గపోరు...

By

Published : Aug 4, 2021, 1:52 PM IST

కర్నూలు అధికార పార్టీ నాయకుల మద్య ఎలాంటి విభేదాలు లేవని కర్నూలు నగర వైకాపా అధ్యక్షుడు రాజా విఘ్ణవర్దన్ రెడ్డి తెలిపారు. కొన్ని రోజులుగా ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులు పార్టీ జెండా ఏర్పాటు విషయంలో గొడవపడి ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. గత రెండు రోజులుగా సామాజిక మధ్యమాల్లో ఒక వర్గంపై అసభ్యకరంగా పొస్టులు పెట్టారు. దీనిపై ఎమ్మెల్యే వర్గం డీఎప్సీకి ఫిర్యాదు చేశారు.

తప్పుడు ఫేస్ బుక్ అకౌంట్​లతో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు నగర వైకాపా అధ్యక్షుడు రాజా విఘ్ణవర్దన్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మద్య విభేదాలు అధిష్టానం దృష్టికి వెళ్లిందని త్వరలోనే అంతర్గత కలహాలకు పరిష్కారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

CHEATING: చీటీలు, డిపాజిట్ల పేరుతో మోసం..లబోదిబోమంటున్న బాధితులు

ABOUT THE AUTHOR

...view details