Place Occupied by YCP Leader: కర్నూలు జిల్లా నందవరం మండలంలోని ముగతిలో కోటి రూపాయలకు పైగా విలువైన సహకార సంఘం స్థలాన్ని వైసీపీ నాయకుడు కబ్జా చేసేందుకు పన్నాగం పన్నాడు. ఆ భవనంలో ప్రస్తుతం గ్రామ సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం తన తండ్రి ఇచ్చిన స్థలమని.. రాత్రికి రాత్రే వైసీపీ నాయకుడు సహకార సంఘం భవనాన్ని నేలమట్టం చేశాడు. ఎమ్మిగనూరుకు సమీపంలో ముగతి ఉండటంతో.. ప్రధాన రహదారి పక్కన స్థలం కావడంతో.. దాని విలువ పెరిగింది. 20 సెంట్లకు పైగా ఉన్న ఈ స్థలానికి.. మార్కెట్లో కోటి రూపాయలకు పైగా విలువ ఉంది. ఈ స్థలాన్ని కబ్జాకు యత్నించడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భూమి విలువ పెరిగింది.. వైసీపీ నాయకుడి కన్ను పడింది
Place Occupied by YCP Leader: స్థలానికి మంచి విలువ ఉంది అని.. సహకార సంఘం స్థలాన్నే కబ్జా చేయాలనుకున్నాడు ఓ వైసీపీ నాయకుడు. ఏకంగా రాత్రికి రాత్రి భవనాన్ని కూల్చేశాడు. గ్రామస్థులు ప్రశ్నిస్తే.. ఇది మా స్థలం అని చెప్తున్నాడు. ప్రసుతం కోటి విలువ చేసే దీనిపై అధికార పార్టీ నాయకుడి కన్ను పడింది. కర్నూలు జిల్లా నందవరం మండలంలోని ముగతిలో ఇది చోటు చేసుకుంది.
సహకార సంఘం స్థలం
"స్వర్గీయ నందమూరి తారక రామారావు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినపుడు.. ఆయన సహకారంతో మేమంతా కలసి నిర్మించాము. ప్రస్తుతం వాళ్ల ప్రభుత్వం వచ్చిందని.. దానిని పగలకొట్టి అమ్ముకోవాలనుకుంటున్నారు. మాదే అని అంటున్నారు. కానీ అది అబద్దం. ప్రభుత్వం డబ్బు, చెక్కులు ఇచ్చినట్టు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎమ్మిగనూరుకు దగ్గరలోనే ఆ స్థలం ఉంది. ప్రస్తుతం ఆ 25 సెంట్ల స్థలం కోటి రూపాయలు చేస్తుంది". -ఈరన్న గౌడ్, మాజీ జడ్పీటీసీ
ఇవీ చదవండి: