ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అహోబిళం వద్ద మహిళ హత్య.. భర్తే నిందితుడు - అహోబిళంలో మహిళ హత్య కేసులో భర్త అరెస్ట్

కర్నూలు జిల్లా అహోబిళం సమీపంలో జరిగిన మహిళ హత్య కేసులో భర్తే ఆమెను చంపినట్లు పోలీసులు నిర్ధరించారు. భార్యపై అనుమానంతో ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు.

woman murder case solved in ahobilam kurnool district
భార్యను చంపిన భర్త అరెస్ట్

By

Published : Jun 26, 2020, 7:41 AM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఈనెల 22వ తేదీన లభ్యమైన మహిళ మృతదేహం వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమెను భర్తే హత్య చేసినట్లు నిర్ధరించారు.

ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు చెప్పిన వివరాల ప్రకారం.. రుద్రవరం మండలం ఆలుమూరుకు చెందిన సుబ్బలక్ష్మమ్మ, చంద్రశేఖర్ భార్యాభర్తలు. గత కొంతకాలంగా ఆమె ప్రవర్తనపై భర్త చంద్రశేఖర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను చంపాలని నిర్ణయించుకుని పథకం రచించాడు. ఈనెల 22న సుబ్బలక్ష్మమ్మను అహోబిళం తీసుకెళ్లి అక్కడి అటవీ ప్రాంతంలో బండరాయితో ఆమె తలపై మోది హతమార్చాడు. మృతదేహం దగ్గర దొరికిన ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి వివరాలు రాబట్టారు. నిందితుడు చంద్రశేఖర్ వీఆర్వో సమక్షంలో లొంగిపోయాడు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details