ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాన్న నాకు ఉద్యోగం రాదు..అందుకే నేను చచ్చిపోతున్నా.. - కర్నూలు జిల్లా

ఉద్యోగం రాలేదన్న బాధతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నాన్నా నువ్వు బాధపడకంటూ ఓ లేఖలో రాసి తనువు చాలించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగింది.

ఉద్యోగం రాలేదంటూ కర్నూలులో మహిళ మృతి

By

Published : Oct 31, 2019, 8:38 AM IST

ఉద్యోగం రాలేదని ఉరి వేసుకుని మహిళ మృతి

నాన్నా.. నాకు ఉద్యోగం రాదు.. నువ్వు బాధ పడుతుంటే నేను చుడలేను.. నాకు బతకాలని లేదంటూ ఓ కాంట్రాక్టు ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగింది. నగరానికి చెందిన ప్రియాంక అనే యువతికోడుమూరులోని గూడూరు వ్యవసాయ శాఖలో ఎం​పీఈవో(వ్యవసాయ విస్తరణ అధికారి)గా కాంట్రాక్టు ఉద్యోగం చేసేది. కర్నూలు నగరంలోని సీతారాం నగర్​లో స్నేహితురాలితో కలిసి అద్దె ఇంట్లో ఉండి రోజూ ఉద్యోగానికి వెళ్లి వచ్చేది. అనూహ్యంగా బుధవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్​కి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉద్యోగం రాలేదనే భాదతో చనిపోతున్నట్లు సూసైడ్ నోటులో రాసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details