కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం దొడ్డిమేకలలో దారుణం జరిగింది. భార్యకు పురుగుల మందు తాగించాడో కసాయి భర్త. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బాధితురాలి భర్తకు మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.
కర్నూలు జిల్లాలో దారుణం.. భార్యకు పురుగుల మందు తాగించిన భర్త - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు జిల్లా దొడ్డిమేకలలో దారుణం జరిగింది. నమ్మివచ్చిన భార్యకు పురుగుల మందు తాగించాడో ఓ కసాయి భర్త. బాధితురాలి పరిస్థితి విషమించటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భార్యకు పురుగులమందు తాగించిన భర్త