నగలు అడిగినందుకు భర్త మర్మాంగాన్ని కోసిన భార్య - undefined
12:23 September 19
నగలు అడిగినందుకు భర్త మర్మాంగాన్ని కోసిన భార్య
కట్టుకున్న భర్తపై అతి దారుణంగా దాడి చేసింది ఓ భార్య. భర్తతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిన భార్య దగ్గరికి వెళ్లాడు భర్త. మెట్టినింటికి రాకపోతే పోయావ్...తాను పెట్టిన నగలు తిరిగి ఇవ్వమని అడిగాడు. అంతే...కోపంతో రగిలిపోయిన భార్య, ఆమె బంధువులు అతని పై దాడి చేశారు. విచక్షణ మరచిన భార్య తన భర్త మర్మాంగాన్ని కోసింది. గాయపడిన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
భర్తను దారుణంగా కొట్టి... మర్మాంగం కోసిన భార్య ఉదంతం కర్నూలు జిల్లాలో జరిగింది. పాణ్యం మండలం ఎస్ కొట్టాల గ్రామానికి చెందిన యూనుస్ కు, గడివేముల మండలం సోమాపురం గ్రామానికి చెందిన హసీనాకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు రావటంతో... హసీనా పుట్టింటికి వెళ్లిపోయింది. తాను పెట్టిన బంగారు ఇవ్వమని అడగటానికి వెళ్లిన యూనుస్ పై భర్త, ఆమె బంధువులు దాడి చేశారు. కాళ్లూ, చేతులూ కట్టేసి... కారం కొట్టి చితకబాదారు. అనంతరం భర్త మర్మాంగాన్ని భార్య కోసింది. వెంటనే బాధితుడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
TAGGED:
wife