ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఐటీ దాడులపై చంద్రబాబు ఎందుకు స్పందించటం లేదు' - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాజా వార్తలు

గతప్రభుత్వ హయాంలో తెదేపా నేతలు అవినీతికి పాల్పడ్డారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ ముఖ్యనేతల ఇళ్లలో ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

By

Published : Feb 15, 2020, 5:23 PM IST

మాట్లాడుతున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

తెదేపాకు చెందిన ముఖ్యనాయకుల ఇళ్లలో ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు స్పందించటం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో తెదేపా నేతలు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. సీఆర్​డీఏకు రాష్ట్ర ఖజానా నుంచి కేవలం రూ.177 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగిలినది బోగస్ కంపెనీలకు మళ్లించారని ఆరోపించారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల మాట్లాడుతూ... వైకాపా నాయకులకు ఆంగ్లం రాదనటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details