కర్నూలు నగరంలో గుక్కెడు తాగునీటి కోసం నగరవాసులు అల్లాడుతున్నారు. మంచి నీటి కోసం మహిళలు ట్యాంకర్లు రాకముందే బిందెలతో క్యూ కడుతున్నారు. అధికారులకు ముందస్తు చర్యలు తీసుకోని కారణంగా.. రోజు రోజుకు తాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. నీటి కొరత ప్రభావంతో రెండు రోజులకోసారి నగరపాలక సంస్థ అధికారులు నీరు విడుదల చేస్తున్నా.. నగరంలోని కొన్ని కాలనీలకు నాలుగు లేదా ఐదు రోజులకు ఓసారి కూడా నీటి సరఫరా కావడం లేదు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకొని కాలనీవాసులు నీటి సమస్యను పరిష్కరించుకుంటున్నారు. ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
వీడని నీటి కష్టాలు... అవస్థల్లో ప్రజలు - water problems
కర్నూలు నగరం తాగు నీటి కష్టాలతో విలవిలలాడుతోంది. బిందెడు నీటి కోసం రోజులు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వీరి పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదు.
నీటి కష్టాలు