కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె జలాశయం నుంచి నీరు లీకవుతోంది. ఈ ఘటనతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం నాలుగు టీఎంసీలు కాగా... ఈ ఏడాది అధిక వర్షాలకు నిండుకుండలా మారింది. ఈ క్రమంలో ఆనకట్ట నుంచి నీరు వృథాగా బయటకు పోతోంది. అధికారులు స్పందించి లీకేజీ సమస్యను పరిష్కరించాలని అన్నదాతలు కోరుతున్నారు.
గాజులదిన్నె జలాశయం నుంచి లీకవుతున్న నీరు - kurnool district latest news
కర్నూలు జిల్లా గాజులదిన్నె జలాశయం లీకేజీ సమస్యతో సతమతమవుతోంది. ఆనకట్ట నుంచి నీరు లీకవుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
గాజులదిన్నె జలాశయం నుంచి లీకవుతున్న నీరు