కర్నూలు జిల్లా తుగ్గలి మండలం కడమకుంట్లలో విషాదం చోటు చేసుకుంది. తాగునీరు పట్టుకునే విషయంలో తోపులాట జరిగి పద్మావతి అనే మహిళ మృతి చెందింది. నిన్న రాత్రి నీటి దగ్గర మహిళల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సొమ్మసిల్లి పడిపోయిన పద్మావతిని ఆసుపత్రికి తరలించారు. పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఈరోజు మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నీటి కోసం గొడవ.. ప్రాణాలు కోల్పోయిన మహిళ - కడమకుంట్ల
తాగునీటి కోసం వెళ్లి ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా కడమకుంట్లలో జరిగింది. నీరు పట్టుకునే విషయంలో మహిళల మధ్య జరిగిన ఘర్షణ ఆమె ప్రాణాలు తీసింది.
నీటి కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయింది