మద్దిలేటి ప్రకృతి అందాలు.. మది దోస్తున్న జలపాత సోయగాలు
వర్షం వల్ల కొండల నుంచి జాలువారే జలపాతాలు చూస్తుంటే మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది కదూ..! ప్రకృతితో మమేకమవుతూ.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఈ దృశ్యాలు కర్నూలు జిల్లా మద్దిలేటి స్వామి దేవాలయం దగ్గరివే. మీరూ చూడండి మరి...!
కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలోని మద్దిలేటి స్వామి దేవాలయం వద్ద జలపాతాల అందాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఆలయంలో నీరు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2017లో ఇలాగే వర్షాలు వచ్చి గుడి మెట్లకు నీళ్లు తాకగా మరల ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,వంకలు పారి మద్దిలేటి స్వామి కొండల్లో నుంచి జాలువారుతూ.. చూపరులను ఆకట్టుకుంటున్నాయి. తిరుగుడు గుండం, చిన్న కోనేరు, పెద్ద కోనేరు పూర్తిగా నిండి పొంగి పొర్లుతున్నాయి. ఆలయం పక్కనే నిర్మించిన వాటర్ షెడ్ నిండడంపై భక్తులు ఆనందిస్తున్నారు.