ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటికోసం ఖాళీ బిందెలతో నిరసన - dharna

వారం రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని.. గూడూరులో మహిళలు, పార్టీ సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు.

నీటి కోసం ధర్నా

By

Published : Aug 22, 2019, 11:57 PM IST

ఖాళీ బిందెలతో రోడెక్కిన స్థానికులు

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతి పరిధిలో వారం రోజులుగా తాగునీరు రావటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న బస్టాండ్ కూడలిలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కమిషనర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్య పరిష్కరించేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఇంఛార్జ్ కమిషనర్​, ఏఈ పవన్​కుమార్​రెడ్డికి పోలీసులు వీరి డిమాండ్ పై సమాచారమిచ్చారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చి.. పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఆందోళన కారణంగా... సుమారు అరగంటపాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details