VIRATA PARVAM:కర్నూలులోని అవుట్‌డోర్ స్టేడియంలో నిర్వహించిన "విరాట పర్వం" సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి గాలి వాన అడ్డంకిగా మారింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు పెద్ద గాలి రావడంతో ఎల్ఈడీ స్క్రీన్ కొంత భాగం కూలిపోయింది. దీంతో ప్రారంభ కార్యక్రమం కాసేపు ఆగిపోయింది. కొంత సమయానికి వాన తగ్గడంతో చిత్ర కథానాయకుడు రానా, కథానాయిక సాయి పల్లవి వేదికపైకి వచ్చారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
"విరాట పర్వం" సినిమా ట్రైలర్‌కి అడ్డంకిగా గాలివాన.. సాయిపల్లవికి గొడుగు పట్టిన రానా..! - కర్నూలు జిల్లా తాజా వార్తలు
VIRATA PARVAM: కర్నూలులోని అవుట్‌డోర్ స్టేడియంలో నిర్వహించిన "విరాట పర్వం" సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి గాలి వాన అడ్డంకిగా మారింది. కొంత సమయానికి వాన తగ్గడంతో చిత్ర కథానాయకుడు రానా, కథానాయిక సాయి పల్లవి వేదికపైకి వచ్చారు. వర్షం జోరందుకోగా హీరో రానా ఆమెకు గొడుగు పట్టడంతో అభిమానులు కేరింతలు కొట్టారు.
"విరాట పర్వం" సినిమా ట్రైలర్‌కి అడ్డంకిగా గాలివాన.. సాయిపల్లవికి గొడుగు పట్టిన రానా..!
నిజజీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు వేణు ఈ సినిమాను అద్భుతంగా మలిచారని రానా తెలిపారు. సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని కోరారు. కార్యక్రమానికి ప్రకృతి సహకరించనందున తిరిగి కర్నూలులోనే విజయోత్సవ సభ ఏర్పాటు చేయాలని సాయి పల్లవి అన్నారు. సరిగ్గా అప్పుడే వర్షం జోరందుకోగా హీరో రానా ఆమెకు గొడుగు పట్టడంతో అభిమానులు కేరింతలు కొట్టారు.
ఇవీ చదవండి: