ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VEGETABLE RATES: పెరిగిన కూరగాయల ధరలు.. అల్లాడుతున్న ప్రజలు - కర్నూలు జిల్లా తాజా వార్తలు

VEGETABLE RATES: రోజురోజుకు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంట గ్యాస్​ ధరలు, నూనె రేట్లు పెరగడంతో ఇప్పటికే అవస్థలు పడుతున్న జనం.. కూరగాయల రేట్ల పెరుగుదలతో బెంబేలెత్తుతున్నారు.

VEGETABLE RATES
పెరిగిన కూరగాయల ధరలు.. అల్లాడుతున్న ప్రజలు

By

Published : May 24, 2022, 3:44 PM IST

VEGETABLE RATES: రోజురోజుకు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండు వారాలుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ధరలు భారీగా పెరిగిపోయాయి. టమోటా బహిరంగ మార్కెట్లో వంద రూపాయలు ఉండగా... రైతు బజార్​లో 86 రూపాయలు పలుకుతోంది. చిక్కుడుకాయలు, క్యారెట్, క్యాప్సికం, క్యాలీ ఫ్లవర్, బీరకాయలు, కాకరకాయలు, పచ్చిమిర్చి రేట్లు సైతం పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో.. సాధారణ, మధ్యతరగతి ప్రజలు అతలాకుతలమవుతున్నారు. 500 రూపాయల నోటు మార్కెట్‌కు తీసుకెళ్లినా.. సంచి నిండటం లేదని వాపోతున్నారు.

పెరిగిన కూరగాయల ధరలు.. అల్లాడుతున్న ప్రజలు

ABOUT THE AUTHOR

...view details