ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు బైక్​లు ఢీ.. ఇద్దరు మృతి - adoni latest news

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.

two died in road accident
two died in road accident

By

Published : Feb 24, 2022, 5:08 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పట్టణ శివారు ఎమ్మిగనూరు బైపాస్ రహదారిలో బుధవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని అమరావతి నగర్​లో దేవర ముగించుకొని నాగలపురం వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని.. నర్సింహులు అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడని.. హనుమేష్ ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని బంధువులు తెలిపారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details