ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాయంత్రం హారతితో ముగియనున్న తుంగభద్ర పుష్కరాలు - Tungabhadra river harati latest news update

పన్నేండేళ్లకు ఒక్కసారి వచ్చే తుంగభద్ర పుష్కరాలు ఈరోజుతో ముగియనున్నాయి. వేదపండితులు గంగమ్మకు హరతి ఇచ్చి పుష్కరాలకు ముగింపు పలకనున్నారు.

Tungabhadra pushkars ending
ఈరోజుతో ముగియనున్న తుంగభద్ర పుష్కరాలు

By

Published : Dec 1, 2020, 12:57 PM IST

కృష్ణమ్మ ఉపనదుల్లో ముఖ్యమైనదిగా పేరొందిన తుంగభద్రకు.. 12 రోజులుగా పుష్కరాలు కొనసాగుతున్నాయి. నేటితో ఆ వేడుక ముగియనుంది. నవంబర్ 20న ప్రారంభమైన పుష్కరాలకు.. సాయంత్రం వేదపండితులు హారతి ఇచ్చి ముగింపు పలకనున్నారు.

కరోనా కారణంగా వెలవెలబోయిన పుష్కర ఘాట్లు.. కార్తీక పౌర్ణమి, సోమవారం నాడు కొంతమేర భక్తుల రద్దీతో కళకళలాడాయి. ఇవాళ పుష్కరాలకు చివరి రోజు అయినప్పటికీ పెద్దగా భక్తుల సందడి కనిపించలేదు. అయితే.. చివరి రోజు కావటంతో నదీ స్నానాలు చేసేందుకు భక్తులకు అధికారులు అనుమతులు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details