నవంబర్ 20న ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు, నేడు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. కరోనా కారణంగా పుష్కరాల ప్రారంభంలో భక్తుల నుంచి ఊహించినంత స్పందన లభించలేదు. ఆ తర్వాత నివర్ తుపాను ప్రభావంతో చలిగాలులు, వర్షాల కారణంగా ఘాట్లు వెలవెలబోయాయి. కార్తిక సోమవారం సందర్భంగా నిన్న భక్తుల తాకిడి పెరిగింది. సంకల్‌బాగ్, మంత్రాలయం ఘాట్లలో రద్దీ కనిపించింది. సోమవారం సాయంత్రం వేదపండితులు తుందభద్ర నదికి పంచహారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
నేటితో తుంగభద్ర పుష్కరాలు పరిసమాప్తం - ఏపీ తాజా వార్తలు
తుంగభద్ర పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. కార్తిక సోమవారం సందర్భంగా ఘాట్లలో నిన్న భక్తుల తాకిడి పెరిగింది. మహిళలు నదిలో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tughabhadra pushkaralu
కార్తిక సోమవారం సందర్భంగా భక్తులు తుంగభద్ర నదిలో దీపాలు వదిలారు. రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని సౌకర్యాలూ కల్పించారు. పుష్కరాలు చాలా బాగా జరిగాయని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. పుష్కరాల ముగింపు వేళ భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి :భూమి నుంచి భారీ శబ్దాలు...పరుగులు తీసిన జనం
Last Updated : Dec 1, 2020, 6:14 AM IST