ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీఎస్​ఆర్టీసీ కి సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్.. కలెక్షన్స్​ ఎంతో తెలుసా? - ఆంధ్ర తాజా వార్తలు

TSRTC Income Increased: ఈ సంక్రాంతి పండగకు టీఎస్​ఆర్టీసీకి అసలైన పండగ వచ్చింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి భారీగా ఆర్టీసీ ఆదాయం పెరిగింది. ఏకంగా 11రోజుల్లోనే రూ.165 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. టీఎస్​ఆర్టీసీ ఆదాయం పెరగడం పట్ల ఆర్టీసీ ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్థన్​, ఎండీ సజ్జనార్​ ఆనందం వ్యక్తం చేశారు.

TSRTC Income Increased Sankranti Festival
TSRTC Income Increased Sankranti Festival

By

Published : Jan 21, 2023, 7:59 PM IST

TSRTC Income Increased Sankranti Festival: సంక్రాంతి పండగ టీఎస్‌ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. సంక్రాంతి పండగ సందర్బంగా టీఎస్ఆర్టీసీ సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం వల్ల అనూహ్య స్పందన వచ్చిందని యాజమాన్యం ప్రకటించింది. ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్​ తెలిపారు.

ఈ నెల 10 నుంచి 20 తేది వరకు.. 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికులను టీఎస్‌ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. సంక్రాంతికి 11 రోజుల్లో మొత్తంగా రూ.165.46 కోట్ల ఆదాయం వచ్చిందని బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. గత ఏడాది సంక్రాంతి కంటే ఈ సంవత్సరం రూ.62.29 కోట్లు ఎక్కువగా ఆదాయం వచ్చిందన్నారు.

సంక్రాంతికి 3.57 కోట్ల కిలోమీటర్ల మేర టీఎస్‌ఆర్టీసీ బస్సులు తిరిగాయని, గత ఏడాదితో పోల్చితే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయని యాజమాన్యం వెల్లడించింది. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయన్నారు. గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో 59.17గా ఉంటే.. ఈ సంక్రాంతికి ఓ.ఆర్ 71.19కి పెరిగినట్లు ఆర్టీసీ పేర్కొంది. సాధారణ చార్జీలతోనే 3,923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందన్నారు.

టీఎస్​ఆర్టీసీలో విద్యుత్​ బస్సులు:డీజిల్వినియోగం, కాలుష్యాన్ని తగ్గించేందుకు టీఎస్​ఆర్టీసీ విద్యుత్​ బస్సులను తేనున్నది. 1000 బ్యాటరీ ఆధారిత విద్యుత్​ బస్సులకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తయారీదారుల మధ్య పోటీని పెంచేందుకు తొలిసారిగా దేశంలోని పలు సంస్థల నుంచి కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు బస్సుల టెండర్లను ఖరారు చేసింది. తెలంగాణకు వెయ్యి బస్సులను సరఫరా చేసే కాంట్రాక్టు జేబీఎం గ్రూప్‌, అశోక్‌ లేలాండ్‌ సంస్థలకు దక్కింది.

టీఎస్​ఆర్టీసీ ఆ రెండు సంస్థలతో త్వరలో ఒప్పందం చేసుకోనుంది. అధికారులు ఇచ్చే ప్రమాణాల మేరకు ఏడాది వ్యవధిలో వెయ్యి బస్సులను అందచేయాల్సిన బాధ్యత గుత్తేదారులదే. కేంద్రం నిర్ణయం మేరకు.. హైదరాబాద్‌లో నడిపే బస్సులకు కిలోమీటరుకు రూ. 55, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 40 చొప్పున గుత్తేదారు సంస్థలకు ఆర్టీసీ చెల్లించాలి. ఆర్టీసీ తరఫున బస్సులో కండక్టర్‌ మాత్రమే ఉంటారు. టికెట్ల విక్రయం, ఛార్జీల వసూళ్లు మినహా ఇతర విషయాలేవీ ఆర్టీసీకి సంబంధం ఉండదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details