ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై తెరాస కార్యకర్తల దాడి - నేటి తెలుగు వార్తలు

Attack on mp aravind house: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కవితపై భాజపా ఎంపీ అర్వింద్‌ వాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్‌లో తెరాస కారకర్తలు ఆందోళనకు దిగారు. బంజారాహిల్స్‌లోని అర్వింద్‌ ఇంటిపై దాడి చేశారు. లోపలికి చొచ్చుకెళ్లి అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కార్యకర్తలను అదుపుచేసే ప్రయత్నం చేశారు.

Attack on MP aravind House
తెరాస కార్యకర్తల దాడి

By

Published : Nov 18, 2022, 5:03 PM IST

తెలంగాణ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై తెరాస కార్యకర్తల దాడి

Attack on MP aravind House: తెలంగాణ రాష్ట్రంలోని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంటి ముట్టడికి వెళ్లిన తెరాస కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇటీవల ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ కవిత పార్టీ మారతారని చెప్పడంతో పాటు ఆయన మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెరాస కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ఘటన జరిగిన సమయంలో ఎంపీ అర్వింద్‌ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్‌లో కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన ఉన్నారు. హైదరాబాద్‌లో తెరాస కార్యకర్తల దాడి నేపథ్యంలో నిజామాబాద్‌లో ఎంపీ ఇంటి వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details