కర్నూలు జిల్లాలోని శ్రీశైలానికి సమీపంలోని నల్లమల్ల అడవిలో ఆదివారం అర్ధరాత్రి పెద్దపులి సంచరించింది. శ్రీశైలానికి 5 కి.మీ దూరంలోని ముఖద్వారం వద్ద పెద్దపులి కనిపించింది. రహదారి పక్కనున్న చెట్ల పొదల్లో ఉన్న పెద్దపులిని .. శ్రీశైలానికి వచ్చే భక్తులు , అదే మార్గంలో వెళ్తున్న 108 అంబులెన్స్ సిబ్బంది తమ సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. చెట్ల పొదల్లో ఉన్న పెద్ద పులి కాసేపటికి రోడ్డుదాటి వెళ్లిపోయింది.
శ్రీశైలం సమీప అటవీప్రాంతంలో పెద్దపులి కలకలం - kurnool district updates
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం సమీప అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం వచ్చిన భక్తులకు.. రోడ్డు దాటుతూ పెద్దపులి కనిపించింది. వాహనదారులు తమ సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు.
పెద్దపులి
Last Updated : Nov 22, 2021, 2:28 AM IST