తుంగభద్ర పుష్కరాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. నివర్ తుపాను ప్రభావంతో... కర్నూలు జిల్లాలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై... చలి గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు కరోనా భయం వెంటాడుతోంది. భక్తులు ఇల్లు దాటి ఘాట్ల వరకు రావటానికి ఆసక్తి చూపటం లేదు.
కొందరు మాత్రం సంకల్ భాగ్ ఘాట్ వద్ద పుణ్యస్నానాలు చేస్తున్నారు. నదిలో ప్రవహం ఎక్కువగా ఉన్నందున భక్తులను నీటిలో ఎక్కువ సమయం ఉండనివ్వడం లేదు. మరోవైపు.. పుష్కర ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియమాలు పాటిస్తూ పుణ్యస్నానాలు చేస్తున్నారు.