కర్నూలు జిల్లా అవుకు మండలం కోనాపురం మిట్ట వద్ద ద్విచక్రవాహనాన్నిలారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొన్నిపల్లె గ్రామానికి చెందిన వెంకటేష్ సోదరి సుంకులు, మరో బాలిక అనూషతో కలిసి.. బనగానపల్లిలో బంధువుల ఇంటి నుంచి సొంత గ్రామానికి బయలుదేరారు. కోనాపురం మిట్ట వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న లారీ టైరు పేలటంతో, వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు.
ఆ మార్గంలోనే వస్తున్న కొందరు ప్రమాదాన్ని గుర్తించి.. గాయపడిన వారికి మంచినీరు అందించి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.