కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈనెల 9వ తేదీన మాధవరం గ్రామానికి చెందిన యువతిని రచ్చమర్రి గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఆమె అంతకుముందే శివాజీ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లయినా మూడో రోజున ఆమె శివాజీతో వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన వధూవరుల బంధువులు శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో దుస్తులు, బియ్యం కాలిపోయాయి. ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప సిబ్బందితో వెళ్లి చుట్టుపక్కల వారితో కలిపి మంటలు ఆర్పేశారు. ఆ సమయానికి శివాజీ కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం రచ్చమర్రి, మాధవరం గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రేమను కాదని పెళ్లి చేసుకుంది... కానీ ఆ తర్వాత 3 రోజులకే.. - ap news
ప్రేమను కాదని పెద్దలు చెప్పినట్లే పెళ్లి చేసుకుంది.. కానీ ఆ తర్వాత మూడు రోజులకే ప్రేమికుడితో వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన నూతన వధూవరుల కుటుంబాలు.. ప్రేమికుడి ఇంటిపై దాడికి దిగారు.. ఇంటికి నిప్పుపెట్టారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో జరిగింది.
woman 1