ప్రకృతి అన్నదాతతో ఆటలాడుతోంది. వర్షాభావంతో శ్రీశైలం జలాశయం అడుగంటడంతో రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి ఏ మాత్రం వరద లేదు. ఎగువున మంచి వర్షాలు కురిసి శ్రీశైలం జలాశయంలోకి 854 అడుగులు నీరు చేరితేనే... పోతిరెడ్డిపాడు కళకళలాడేది! జలాశయం అడుగంటడంతో... అన్నదాతలపై వ్యథలను వారి మాటల్లోనే విందాం...
అడుగంటిన శ్రీశైలం... బక్కచిక్కిన "పోతిరెడ్డిపాడు"..! - ఎస్సార్ బీసీ
జలకళకు నిలువెత్తు సాక్ష్యమైన శ్రీశైలం జలాశయం అడుగంటుతోంది. నిత్యం కళకళలాడే ఆ ప్రాంతమంతా చుక్కనీరు లేక వెలవెలబోతోంది. రాయలసీమకు జీవనాడి అయిన... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ బక్కచిక్కింది. తెలుగుగంగ, గాలేరు నగరి, ఎస్సార్ బీసీ, కేసీ కెనాల్ ప్రాజెక్టులు నీటి కోసం అర్రులు చాచాయి.
అడుగంటిన శ్రీశైలం... బక్కచిక్కిన "పోతిరెడ్డిపాడు"..!