శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. జూరాల నుంచి శ్రీశైలానికి 42 వేల 589 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుత నీటినిల్వ 215.8070టీఎంసీలగా ఉంది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 35 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అదే విధంగా శ్రీశైలం నుంచి హంద్రీనీవాకు 2 వేల 026 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
గరిష్ట స్థాయికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం
ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో శ్రీశైలం నుంచి నీటిని పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా జలాశయాలకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం