ఆ కళ్లు లోకాన్ని చూడలేక పోతేనేెం...వారి మనస్సు పేదవారి ఆకలిని తెలుసుకోగలిగింది. ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తూ అందరికి ఆదర్శప్రాయంగా నిలిచారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో స్పందన అంధుల సంక్షేమ సంఘం నెలలో రెండో శనివారం పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అన్నదానం చేస్తున్నారు. తమ సొంత నిధులతో పాటు ..దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. స్థానికంగా గతంలో నిర్మించిన అన్న క్యాంటీన్ భవనంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వృద్ధులు.. దివ్యాంగులు , అనాథల కోసం ప్రత్యేకంగా ఈ అన్నదానాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
పేదల ఆకలి తీరుస్తున్న అంధుల సంక్షేమ సంఘం - పేదల ఆకలి తీరుస్తున్న అంధుల సంక్షేమ సంఘం
అంధులైన వారు.. వృద్ధులు, దివ్యాంగుల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేశారు. అన్న క్యాంటీన్ భవనంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ... అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
పేదల ఆకలి తీరుస్తున్న అంధుల సంక్షేమ సంఘం