ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: ఏపీ ఎన్జీవో - ఐదు విడతల డీఏ

సీఎం వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కర్నూలులో ఏపీ ఎన్జీవో సంఘం డిమాండ్ చేసింది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరింది. బకాయి ఉన్న ఐదు విడతల డీఏలో కనీసం ముడు విడతల డీఏను వెంటనే చెల్లించాలని స్పష్టం చేసింది.

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : ఏపీ ఎన్డీఓ
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : ఏపీ ఎన్డీఓ

By

Published : Sep 30, 2020, 12:18 AM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కర్నూలులో ఏపి ఎన్జీవో సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని.. ఉద్యోగ సంఘల నాయకులతో చర్చించాలని కోరారు.

కనీసం మూడు డీఏలైనా..

బకాయి ఉన్న ఐదు విడతల డీఏలో కనీసం ముడు విడతల డీఏను వెంటనే చెల్లించాలన్నారు. లేని పక్షంలో పోరాటానికి సిద్ధపడతామని ఉద్యోగ సంఘల నేతలు హెచ్చరించారు.

ఇవీ చూడండి:

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్, డైరెక్టర్ల ఎంపిక పూర్తి

ABOUT THE AUTHOR

...view details