కర్నూలు జిల్లా డోన్ పట్టణం పాతపేటలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. దస్తగిరి స్వామి కట్ట దగ్గర కూర్చున్న ఇద్దరు యువకులపై కత్తులు, రాడ్ల తో అదే కాలనీకి చెందిన యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో చందు, చిన్నా అనే వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే అటునుంచి కర్నూలుకు తరలించారు. మట్కా, అక్రమ మద్యం విషయాల్లో గతంలో కూడా రెండు వర్గాల మద్య ఘర్షణలు జరిగాయి. ఇరువురిపై కేసులు ఉన్నాయి. దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేపట్టారు.
మద్యం పట్టివేత
కృష్ణాజిల్లా మైలవరం మండలంలోని చంద్రల గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 251 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. అందులో 30 క్వార్టర్ బాటిల్, 221 ఫుల్ బాటిళ్లు ఉన్నాయి. వీటి విలువ 51వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మద్యం తరలిస్తున్న ద్విచక్రవాహనం సీజ్ చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.